2, సెప్టెంబర్ 2010, గురువారం

సెక్స్.. ఏ వేళలో మజాగా ఉంటుంది...?

ఏ వేళలో సెక్స్ మజాగా ఉంటుంది..? అని అడిగితే సెక్స్‌కి వేళ ఏమిటి మనసు ముఖ్యం కాని అంటారు అనుభవజ్ఞులు. నిజమే. రాత్రివేళ ఏకాంత సమయం, చక్కని పడకగది వాతావరణం సెక్సీ మూడ్‌ని పెంచుతుంది. ఆ విషయంలో ఆడ, మగ అభిప్రాయం ఒక్కటే. ఒకవేళ రాత్రి కుదరకపోతే వారు కోరుకునే మరో అనుకూల సమయం వేకువజాము.

అంతేకాని మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో సెక్స్‌కి సుముఖత అతి తక్కువ శాతం ఉంది. దీనికి కారణం సెక్స్‌కి మధ్యలో ఎటువంటి అడ్డంకి ఉండకూడదన్నది ఆడ, మగ అభిప్రాయం. ఒకసారి మొదలుపెడితే అది ఎటువంటి ఆటంకం లేకుండా అత్యున్నత స్థాయికి చేరి అనుభవించినప్పుడే బాగుంటుందని, కాబట్టి రాత్రివేళను ఇష్టపడతారన్నది స్పష్టమైన విషయం.

ఝాన్సీ గ్లామర్‌కు గులామైన ఆ పురుషుడెవరో!

దశాబ్దానికిపైగా యాంకర్‌గా, ఆ తర్వాత నటిగా సక్సెస్ అయిన ఝాన్సీ వైవాహిక జీవితంలో మాత్రం సక్సెస్ కాలేకపోయింది. తన కెరీర్ ప్రారంభంలో మీడియాకు చెందిన జోగినాయుడ్ని పెళ్లాడింది. ఇద్దరిదీ ఒకే ఊరు కావడంతో వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.

పొడుగులో ఇద్దరూ భిన్నధృవాలైనప్పటికీ కొన్నాళ్లు సంసారం బాగానే సాగింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆమె జోగినాయుడికి దూరంగా ఉంది. వీరి కాపురానికి గుర్తుగా 8 ఏళ్ల పాప ఉండటంతో ఆమె కెరీర్‌ను దృష్టిలో పెట్టుకుని వేరే వివాహం చేసుకోలేకపోయింది ఝాన్సీ.

ప్రస్తుతం సమస్యలు తీరడంతో ప్రముఖ వ్యక్తిని పెండ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలని ఝాన్సీ నిర్ణయించుకున్నట్లు ఫిలిమ్‌నగర్ టాక్. ఇప్పటికీ గ్లామర్‌ను కాపాడుకుంటూ ముందుకు వెళుతున్న ఝాన్సీ గ్లామర్‌కు గులామైన ఆ పురుషుడెవరో తెలుసుకోవాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే...!!

వైఎస్ వర్థంతి వేడుకలకు సీఎం డుమ్మా!

దివంగత ముఖ్యమంత్రి, జన హృదయనేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రథమ వర్థంతి వేడుకలకు ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య దూరమయ్యారు. గత రెండు రోజులుగా వైరల్ ఫీవర్‌తో ఆయన బాధపడుతున్నారు. గురువారం ఉదయం నిమ్స్ వైద్యులు ముఖ్యమంత్రికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మరో 24 గంటల పాటు అన్ని రకాల అధికార కార్యక్రమాలను రద్దు చేసుకోవాలని వైద్యలు చూసించారు. ఫలితంగా వైఎస్ మొదటి వర్థంతి వేడుకల్లో ఆయన పాల్గొనలేక పోయారు.

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గురువారం మధ్యాహ్నం 12 గంటలకు నల్లకాలువ వద్ద వైఎస్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాల్సి వుంది. సాయంత్రం ప్రభుత్వం రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో పాల్గొనాలి. వీటన్నింటినీ ముఖ్యమంత్రి రద్దు చేసుకున్నారు. ఇదిలావుండగా, అనారోగ్యం కారణంగా బుధవారం జరిగిన ప్రధాని మన్మోహన్ సింగ్ పర్యటనకు కూడా ఆయన దూరంగా ఉన్న విషయం తెల్సిందే.