దివంగత ముఖ్యమంత్రి, జన హృదయనేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రథమ వర్థంతి వేడుకలకు ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య దూరమయ్యారు. గత రెండు రోజులుగా వైరల్ ఫీవర్‌తో ఆయన బాధపడుతున్నారు. గురువారం ఉదయం నిమ్స్ వైద్యులు ముఖ్యమంత్రికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మరో 24 గంటల పాటు అన్ని రకాల అధికార కార్యక్రమాలను రద్దు చేసుకోవాలని వైద్యలు చూసించారు. ఫలితంగా వైఎస్ మొదటి వర్థంతి వేడుకల్లో ఆయన పాల్గొనలేక పోయారు.
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గురువారం మధ్యాహ్నం 12 గంటలకు నల్లకాలువ వద్ద వైఎస్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాల్సి వుంది. సాయంత్రం ప్రభుత్వం రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో పాల్గొనాలి. వీటన్నింటినీ ముఖ్యమంత్రి రద్దు చేసుకున్నారు. ఇదిలావుండగా, అనారోగ్యం కారణంగా బుధవారం జరిగిన ప్రధాని మన్మోహన్ సింగ్ పర్యటనకు కూడా ఆయన దూరంగా ఉన్న విషయం తెల్సిందే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి